Lifting of Govardhana Giri, Sri Krishna

శ్రీ కృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన గోవర్థనగిరి గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?



ఉధృతంగా కురిసిన వర్షాలు దాని వల్ల ఉత్పన్నమైన వరదలకు కొట్టుకుపోతున్న ప్రజలను, పశువులను కాపాడడానికి శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో గోవర్ధన గిరిని చిటికిన వేలితో ఎత్తాడు. అలాంటి గోవర్ధన గిరికి ఓ శాపం ఉంది. ఇంతకీ అప్పటి గోవర్ధన గిరి ఇప్పుడు ఎక్కడ తెలుసా?ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రాంతంలో ప్రస్తుతం ఈ పర్వతం ఉంది. ఈ పర్వతానికి ప్రతి ఏడాది దీపావళి వెళ్ళాక అక్కడి ప్రజలు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఇక ఈ పర్వతానికి ఏం శాపం ఉందో? అది ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.పూర్వం పర్వత రాజైన ద్రోణకలుడికి గోవర్ధనుడు, యమున అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వారిలో గోవర్ధనుడు గోవర్ధన పర్వతంగా యమున నదిగా మారారు.ఈ సమయంలో బ్రహ్మదేవుని మనమడు మహా ఋషి అయిన పులస్త్యుడు ద్రోణకలుడిని కలిసి కాశీలో గోవర్ధన పర్వతం ఉంటే భక్తులకు తమలాంటి ఋషులకు పూజలు చేయడానికి సౌలభ్యంగా ఉంటుందని కోరాడు.

అందుకు ద్రోణకలుడు అంగీకరించాడు.గోవర్ధనుడికి అసలు ఈ విషయం నచ్చలేదు కానీ తండ్రి మాట కాదనలేక పులస్త్యుని వెంట ఒక షరతుతో వెళ్ళాడు. తనని పులస్త్యుడు కాశీ వరకు దింపకుండా వెళ్లాలని అన్నాడు. అందుకు పులస్త్యుడు కూడా అంగీకరించాడు. దీనితో పులస్త్యుడితో వెళ్తున్న గోవర్ధనుడు.

తన చెల్లి ప్రవహిస్తున్న మధురా నగరం యొక్క ప్రకృతి అందాలకు ముగ్ధుడయ్యాడు ఎలాగైనా అక్కడ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు అందుకే క్రమక్రమంగా బరువు పెరగడం మొదలుపెట్టాడు.

విషయం తెలుసుకున్న పులస్త్యుడు వెంటనే గోవర్ధనుడని శపించాడు.ఆ శాపం ప్రకారం గోవర్ధనుడు సంవత్సరానికి ఆవగింజంత పరిమాణాన్ని కోల్పోతాడు.ఇలా తను భూమికి సమతులంగా మారగానే కలియుగాంతం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.




Post a Comment