Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు 

vidhura, vibhishana viswarupudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు

Vidhura : విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం(pale) వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబిక కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.
Vibhishana : విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము . రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణ, కుంభకర్ణు లు విభీషణుడి అన్నలు. ఇతని భార్య పేరు ' సరమ ' . రావణ సంహారము తర్వాత లంక కు రాజు అయ్యాడు .

Viswarupudu : విశ్వ రూపుడు -- విశ్వకర్మ కుమారుడు , సూర్యుని 

కుమార్తె ' విష్టి ' ఇతని భార్య .

Post a Comment