magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ?

magha pornani  

మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? ఈ రోజున ఏమి చేయాలి ? ఏ దేవత ఆరాధన చేయాలి ? తెలుసుకుందామా?

అయితే ఇక చదవండి.

ఈ రోజు మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు.అన్ని పౌర్నమిలలో కన్నా ఈ పౌర్ణమి చాలా విశిష్టతను కలిగి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు సముద్ర స్నానం కానీ లేదా నదీ స్నానం కానీ చేయాలి. దగ్గరలో నది ఉండగా కూడా నది స్నానం ఆచరించకపోవడం చాలా పాపం అవుతుంది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులో గాని, లేదా బావి వద్ద అయినా స్నానం చేయాలి.
యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాల్లో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. . జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ... మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన
ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే... మాఘం స్నానాలకు ప్రత్యేకం. నారద పురాణాన్ని అనుసరించి... దేవతలు తమ శక్తులనూ తేజస్సులనూ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా మంచిది.
ఈ రోజున వస్త్రాలూ గొడుగులూ నువ్వులూ దానంచేస్తే విశేషఫలం లభిస్తుంది.
స్నానం చేసే సమయంలో ..!
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి !
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు !....అనే మంత్రం చదువుతూ స్నానం చేయాలి


Post a Comment