About Pancha number - పంచ అనే సంఖ్య విశిష్టత

About Pancha number - పంచ అనే సంఖ్య విశిష్టత
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
పంచ అనే సంఖ్య విశిష్టత :

పంచ భూతములు భూమి,నీరు, అగ్ని, గాలి, ఆకాశము. ( పృథివ్యాపస్తేజో వాయురాకాశములు )
పంచేంద్రియాలు -ఘ్రాణేంద్రియం (ముక్కు), రసనేంద్రియం (నాలుక), చక్షురింద్రియం (కన్ను), త్వగింద్రియం(చర్మం), శ్రోత్రేయింద్రియం (చెవి)
పంచ మహాపాతకాలు స్వర్ణస్తేయం, సురాపానం, బ్రహ్మహత్య, గురుపత్నిగమనం, మహాపాతకసహవాసము (బంగారం దొంగిలించటం, మద్యం సేవించడం, బ్రాహ్మణుని హత్య చేయడం, గురువు భార్యను పొందడం,మహా పాపులతో చెలిమి చేయడం)
పంచ పర్వములు కృష్ణపక్ష అష్టమి, కృష్ణపక్ష చతుర్డశి, అమావాస్య ,పూర్ణిమ, సంక్రాంతి
పంచ ప్రాణములు ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం
పంచోపవాయువులు నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనుంజయం
పంచ మహాకావ్యాలు- మనుచరిత్ర (పెద్దన), వసు చరిత్ర(భట్టుమూర్తి), రాఘవ పాండవీయం(సూరన), పాండురంగమాహత్మ్యం(తెనాలి రామలింగడు), శృంగార నైషధము(శ్రీనాధుడు).
పంచ కన్యలు అహల్య, తార, ద్రౌపది,సీత, మండోదరి.
పంచారామాలు ద్రాక్షారామం, భీమారామం, కుమారామారం, అమరారామం, క్షీరారామం.
పంచాయతన దేవతలు ఆదిత్యం, ఆంబికం, గణనాధం, విష్ణుం,, మహేశ్వరం
పంచ ముఖాలు ఆఘోరము, ఈశానము,తత్పురుషము, వామదేవము, సద్యోజాతము. 



Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html

Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html

Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html
పంచ గంగలు కావేరి, తుంగభద్ర, కృష్ణవేణీ, గౌతమి, భాగీరధి.
పంచ భక్ష్యములు భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం.
పంచాంగములు తిథి, వారము,నక్షత్రము, యోగము, కరణము
మాతృపంచకము రాజు భార్య, అన్న భార్య, గురు భార్య, భార్యనుగన్న తల్లి, తన్ను గన్న తల్లి.
పితృపంచకం- తన్నుగన్నవాడు, తనకు వడుగు చేసినవాడు, చదువు చెప్పించినవాడు, విపత్తున అన్నము పెట్టి కాపాడినవాడు, ఆపద యందు భయము దేర్చి రక్షించినవాడు.
విష్ణుదేవుని పంచాయుధములు శంఖము, చక్రము, గద,ఖడ్గము,,శార్గము
సంస్కృత పంచకావ్యములు రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం, కాశే ఖండము, కిరాతార్జునీయం.
పంచవర్ణములు తెలుపు, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ.( గాయత్రి దేవి ముఖములు )
   sri lalitha tripura sundari 


పంచ గవ్యములు గోమూత్రము, ఆవు పేడ,నెయ్యి, పెరుగు,పాలు.
పంచామృతములు ఆవుపాలు,ఆవుపాల పెరుగు, ఆవునేయి, తేనె, పంచదార.


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Post a Comment